Black fungus: చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. 33 మంది..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-05-24 22:03:57  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒకే రోజు కొత్తగా 15 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 9, స్విమ్స్ ఆసుపత్రిలో 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 33కు చేరింది. రుయా ఆసుపత్రిలో 21 మంది, స్విమ్స్‌లో 12 మంది [&hellip;]</p>

black fungus
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఒకే రోజు కొత్తగా 15 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో 9, స్విమ్స్ ఆసుపత్రిలో 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య 33కు చేరింది. రుయా ఆసుపత్రిలో 21 మంది, స్విమ్స్‌లో 12 మంది చికిత్స తీసుకుంటున్నారు. జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.

Next Story