ప్రదీప్ మాచిరాజు డేట్ ఫిక్స్ చేశాడు!

by  |
ప్రదీప్ మాచిరాజు డేట్ ఫిక్స్ చేశాడు!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై హోస్ట్‌గా రాణిస్తున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. అమృత అయ్యర్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ సినిమా పాటలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకోగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతికి పెద్ద సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అవుతుండగా.. లేటెస్ట్‌గా ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించింది మూవీ యూనిట్. జనవరి 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుందని .. తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ఆడియన్స్‌ను కోరారు మేకర్స్. మున్నా డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను బాబు ఎస్‌వీ నిర్మిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.



Next Story

Most Viewed