అందరికీ నా మూవీ కనెక్ట్ అవుతుంది : ప్రదీప్

by  |
అందరికీ నా మూవీ కనెక్ట్ అవుతుంది : ప్రదీప్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్‌గా మున్నా డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న విడుదల అవుతున్న మూవీ ప్రతి ఒక్కరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుందన్నారు ప్రదీప్. మున్నా కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానని.. నిర్మాత చాలా సపోర్ట్ చేశారని తెలిపారు. ప్రొడ్యూసర్‌కు జాబ్ శాటీస్ ఫాక్షన్‌తో పాటు జేబు శాటీస్ ఫాక్షన్ కూడా కలగాలని కోరుకున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, శివేంద్ర విజువల్స్ సినిమాకు బిగ్ అసెట్ అన్న ప్రదీప్.. టాకీసులో మూవీ చూశాక చిరునవ్వుతో బయటకు వస్తారని ప్రామిస్ చేశారు.


Next Story

Most Viewed