ప్రదీప్ సినిమాపై మెగా ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్

by  |
ప్రదీప్ సినిమాపై మెగా ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ .. ఈ సినిమాతోనే యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. అమృతా అయ్యర్ హీరోయిన్ కాగా…. మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.వి. బాబు నిర్మాత. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ యువతను ఆకట్టుకోగా… నీలి నీలి ఆకాశం సాంగ్ ఇంకా ట్రెండింగ్‌లో ఉంది.

అనూప్ రూబెన్స్ సంగీతం ఇప్పటికే మెస్మరైజ్ చేయగా.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో మూవీ సూపర్ హిట్ అవుతుందనే ధీమాతో ఉంది యూనిట్. ప్రమోషన్స్ కూడా ఆ లెవల్లోనే చేస్తోంది. దీంతో నిర్మాత అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపారంట. అంతే కాదు ప్రదీప్‌ బుల్లితెరపై చేసిన అల్లరికి అభిమానులు ఎక్కువే. ఇది కూడా సినిమాకు కలిసివచ్చే విషయమే. కాగా ఎలాంటి ఆలోచన లేకుండా నిర్మాతకు డబుల్ రేట్ ఇచ్చేసి సినిమాను కొనుగోలు చేశారని తెలుస్తోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలో ప్రదీప్ రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్.



Next Story

Most Viewed