డేంజర్ జోన్.. నర్సంపేటలో 24 గంటల్లోనే రెండో ప్రమాదం

by  |
డేంజర్ జోన్.. నర్సంపేటలో 24 గంటల్లోనే రెండో ప్రమాదం
X

దిశ, నర్సంపేట : నర్సంపేట నుంచి ఖానాపురం వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి 365 రక్తమోడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తన తండ్రి కేసు నిమిత్తం ఇంటికి వెళ్తున్న సురేష్ చెట్టుకు ఢీ కొని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది గడిచి 24 గంటలు గడవక ముందే సరిగ్గా అదే స్థలంలో మరో ప్రమాదం సంభవించింది. స్థానిక ఎంజీఆర్ మిల్లు దగ్గరలో ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన వెలిషోజు వినీత్, మంగళవారిపేట గ్రామానికి చెందిన మల్లేష్‌గా గుర్తించారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కి తరలించినట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed