దేశంలో కరోనా ఉగ్రరూపం..

by Vadlamudi Anukaran |

<p> న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో రోజు రోజుకూ కరోనా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా 2812 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,95,123కు చేరింది. ఇక తాజాగా కరోనా కేసుల సంఖ్య 3లక్షల 50వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. [&hellip;]</p>

india corona sticker
X

న్యూఢిల్లీ: కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. దేశంలో రోజు రోజుకూ కరోనా మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి తాజాగా 2812 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,95,123కు చేరింది. ఇక తాజాగా కరోనా కేసుల సంఖ్య 3లక్షల 50వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 3,52,991 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. కాగా ప్రస్తుతం దేశంలో 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నట్టు హెల్త్ బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 2,19,272 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రికవరీల సంఖ్య 1,43,04,382గా నమోదైంది.

Next Story