- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి
<p>శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా, శనివారం సొపోర్ పట్టణంలోని ఓ చెక్‌పోస్ట్ దాగ్గర విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడులు జరగడం వారం వ్యవధిలో ఇది మూడోది. బారాముల్లా జిల్లాలోని సొపోర్ పట్టణంలోని చెక్‌పోస్టు దగ్గర సీఆర్‌పీఎఫ్, పోలీసులు బలగాలు సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నాయి. కాగా, ముష్కరులు […]</p>

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. తాజాగా, శనివారం సొపోర్ పట్టణంలోని ఓ చెక్‌పోస్ట్ దాగ్గర విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదుల దాడులు జరగడం వారం వ్యవధిలో ఇది మూడోది. బారాముల్లా జిల్లాలోని సొపోర్ పట్టణంలోని చెక్‌పోస్టు దగ్గర సీఆర్‌పీఎఫ్, పోలీసులు బలగాలు సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నాయి. కాగా, ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ తీవ్రవాదులకోసం సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు అధికారులు తెలిపారు.
tags:jammu kashmir, attack, terrorists, crpf, defence, police personnel, killed
Next Story






