ఈ యాక్సిడెంట్ ఖరీదు అక్షరాలా రూ.30 కోట్లు!!

by  |
ఈ యాక్సిడెంట్ ఖరీదు అక్షరాలా రూ.30 కోట్లు!!
X

దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం, అతి పెద్ద రోడ్డు యాక్సిడెంట్ అని విన్నాం కానీ ఈ ఖరీదైన యాక్సిడెంట్ ఏంటి అనుకుంటున్నారా? అవును మరి.. ఈ యాక్సిడెంట్ విలువ ఒకటా రెండా… సుమారు రూ.30 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 3 కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇలాంటి ప్రమాదం జరిగితే అందులో ఉన్నవారి సంగతేమో గానీ ఎక్కువమంది కార్ల ధర గురించేగా మాట్లాడుకునేది.

ఇంతకీ విషయం ఏమిటంటే… స్విస్ అల్ప్స్‌లోని పిక్చర్స్‌క్యూ గాట్హార్డ్ పాస్‌లో మెర్సెడీస్ బెంజ్ సి-క్లాస్ వ్యాగన్ (Mercedes Benz C-Class Wagon), పోర్స్చే 911 క్యాబ్రియోలెట్ (Porsche 911 Cabriolet), బుగట్టి చిరోన్ కార్లు (Bugatti Chiron car) ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ మూడు కార్లు రోడ్డు మీద వేగంగా ప్రయాణిస్తున్నాయి. వీటి ముందు వెళ్తున్న మోటార్ హోం వెహికిల్ ని ఓవర్‌టేక్‌ చేయడానికి ప్రయత్నించాయి.

దీంతో మూడు కార్లు అదుపు తప్పి ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే హుటాహుటిన అక్కడికి అంబులెన్స్‌లు వచ్చి కారులో ప్రయాణిస్తున్న వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ కార్లకు జరిగిన నష్టం అక్షరాలా 4 మిలియన్ డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.30 కోట్లు.


Next Story

Most Viewed