2కోట్లు దాటిన వ్యాక్సినేషన్.. పంపిణీకి మరిన్ని సిద్ధం

by  |
2కోట్లు దాటిన వ్యాక్సినేషన్.. పంపిణీకి మరిన్ని సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల నియంత్రణకు పలు రాష్ట్రాలు రాత్రిపూట నిర్భంధంతో పాటు లాక్‌డౌన్ కూడా ప్రకటించాయి.

ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని భావించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ అక్షరాల 2,09,22,344 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 71లక్షల మందికి తొలిడోసు, మరో 37లక్షల 54వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.



Next Story