ఏపీలో ఈ రోజు ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 95,366 సాంపిల్స్‌ను పరీక్షించగా 2,925 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,20,178 కు పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 26 మంది మృతి చెందగా..మెుత్తం మరణాల సంఖ్య 11763కి పెరిగాయి. ఇకపోతే గడచిన 24 గంటల్లో 12,986 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 18,77,930కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story

Most Viewed