మదనపల్లిలో 29 ఖైదీలకు కరోనా

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా సోకింది. 161 మంది ఖైదీలకు టెస్టులు చేయగా, 29 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఖైదీలను వెంటనే చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రిమాండ్‌పై వచ్చిన వారిని ఖైదీలతో కలిసి ఉంచడంతోనే కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల పీలేరుకు చెందిన ఓ వ్యక్తి రిమాండ్‌పై మదనపల్లె సబ్ జైల్‌కు వచ్చారు. అతని ద్వారా 29 మందికి [&hellip;]</p>

మదనపల్లిలో 29 ఖైదీలకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మదనపల్లె సబ్ జైల్లో 29 మందికి కరోనా సోకింది. 161 మంది ఖైదీలకు టెస్టులు చేయగా, 29 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఖైదీలను వెంటనే చిత్తూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. రిమాండ్‌పై వచ్చిన వారిని ఖైదీలతో కలిసి ఉంచడంతోనే కేసులు పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల పీలేరుకు చెందిన ఓ వ్యక్తి రిమాండ్‌పై మదనపల్లె సబ్ జైల్‌కు వచ్చారు. అతని ద్వారా 29 మందికి కరోనా సోకినట్లు తేలింది.

Next Story