- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర అవార్డులకు 27 మంది పోలీసులు ఎంపిక
<p>దిశ,తెలంగాణ బ్యూరో : ప్రతి సంవత్సరం పంద్రాగస్టు సందర్భంగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని ఉత్తమ ప్రదర్శన, ధైర్యసాహసాలు కనబరిచిన వారికి అవార్డులిస్తుంది. అదేవిధంగా ఈ యేడాది కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసు, సైనికాధికారులకు పతాకాలు ప్రకస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఇందులో ఇద్దరికి అత్యున్నత రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎంబీ) రాగా 628 మంది గ్యాలంటరీ పతకాలు(పీఎంబీ)లకు ఎంపికయ్యారు. అంతేకాకుండా 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను […]</p>

దిశ,తెలంగాణ బ్యూరో : ప్రతి సంవత్సరం పంద్రాగస్టు సందర్భంగా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల్లోని ఉత్తమ ప్రదర్శన, ధైర్యసాహసాలు కనబరిచిన వారికి అవార్డులిస్తుంది. అదేవిధంగా ఈ యేడాది కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసు, సైనికాధికారులకు పతాకాలు ప్రకస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఇందులో ఇద్దరికి అత్యున్నత రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎంబీ) రాగా 628 మంది గ్యాలంటరీ పతకాలు(పీఎంబీ)లకు ఎంపికయ్యారు. అంతేకాకుండా 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను కేంద్రం ఇవ్వనుంది.
ఈ పతకాల్లో తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ లు(పీపీఎం) ఇద్దరికి, 11 మందికి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అందులో గ్యాలంటరీ పతకాలు దక్కిన వారిలో పీకేఎస్ రమేష్(ఏఏసీ), ఎన్.లాల్య(ఎస్‌సీ), ఎం.పాపారావు(జేసీ), ఎం.భాస్కరరావు(జేసీ), జి.ప్రతాప్ సింగ్(జేసీ), కె.వెంకన్న(జేసీ), మాలోతు రాములు(జేసీ), బి.మరియా దాస్(డిప్యూటీ ఏసీ), కె. పరశురాం నాయక్(ఎస్‌సీ), అబ్దుల్ అజీమ్(జేసీ), కె.తిరుపతయ్య(ఎస్‌సీ), పి.సత్యనారాయణ(జేసీ), వి.రమేష్(జేసీ), గుర్రమ్ కృష్ణ ప్రసాద్ లు ఉన్నారు.
పీపీఎం అవార్డులకు ఎంపికైన వారిలో అడిషనల్ డీజీపీ (ఉమెన్ సేప్టీ) స్వాతి లక్రా, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగాం వెస్ట్ జోన్ డీసీపీ బండా శ్రీనివాస రెడ్డి ఉన్నారు. విశిష్ట సేవాపతకాలకు ఇంటలిజెన్స్ డీఐజీ వి. శివకుమార్, మాధాపూర్ జోన్ డిప్యూటీ కమిషనర్ మెగావత్ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ అడిషనల్ ఎస్పీ డండుగుడు రమేష్, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, మాధాపూర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ డీఎస్పీ మువ్వ పిచ్చయ్య, మొదటి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సంపత్ కుమార్ రెడ్డి, ఎస్ఐబీ ఏఎస్ఐ ఆనంద్ కుమార్, ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ ఏఎస్ఐ చంద్రశేఖర్ రావు, ఏడీజీపీ గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో ఆరిఫ్ అలీ మహమ్మద్, కాచీగూడ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అనిల్ గౌడ్ లు ఉన్నారు.






