హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా

by  |
హుస్నాబాద్‌లో విజృంభిస్తున్న కరోనా
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని కరోనా మహమ్మారి విజృభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా సోమవారం హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 322 మందికి కరోనా టెస్టులు చేయగా, హుస్నాబాద్ 19, అక్కన్నపేట 12, కోహెడ 05, బెజ్జంకి 06, మద్దూర్ 07 మండలాల్లో మొత్తం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు పలు మండలాల వైద్యాధికారులు తెలిపారు. కరోనా సంబంధించిన పూర్తి వివరాల కోసం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఏమైన సందేహాలు ఉంటే 99895 20732 ఫోన్ నెంబర్ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed