- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
25 బస్తీ దవాఖానాలు ప్రారంభం
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నగరంలో 168 బస్తీ దవాఖానాలు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 193కు పెరిగింది. మంత్రి కేటీఆర్ హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్, యాకత్‌పురలోని జవహర్‌నగర్, కవాడిగూడలో ఆసుపత్రులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బస్తీ దావాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలో మరో 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నగరంలో 168 బస్తీ దవాఖానాలు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 193కు పెరిగింది. మంత్రి కేటీఆర్ హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్, యాకత్‌పురలోని జవహర్‌నగర్, కవాడిగూడలో ఆసుపత్రులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బస్తీ దావాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్టలో బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, స్థానిక కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఇలా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బస్తీ దాఖానాలను నాయకులు ప్రారంభించారు.






