‘పవర్’ ఫుల్ కెరీర్‌కు 24 ఏళ్లు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&#8230; ఈ పేరు వింటే అభిమానుల్లో ఏ వైబ్రేషన్ మొదలవుతుంది. ఆయన సినిమా వచ్చినా, బర్త్ డే వచ్చినా అభిమానులు ఓ పండగలా, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి నేటికి 24 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజున 1996 అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి&#8230; ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదల అయింది. నాటి నుంచి తనదైన [&hellip;]</p>

‘పవర్’ ఫుల్ కెరీర్‌కు 24 ఏళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరు వింటే అభిమానుల్లో ఏ వైబ్రేషన్ మొదలవుతుంది. ఆయన సినిమా వచ్చినా, బర్త్ డే వచ్చినా అభిమానులు ఓ పండగలా, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగుపెట్టి నేటికి 24 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజున 1996 అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ మొట్ట మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి… ఇక్కడ అబ్బాయి’ సినిమా విడుదల అయింది. నాటి నుంచి తనదైన శైలిలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. కోట్లాది గుండెల్లో గూడుకట్టుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోలు ఆయనకు అభిమానులుగా ఉన్నారు. అంతేగాకుండా ఆయన అభిమానులు ఈరోజునే వరల్డ్ పవనిజం డేగా నిర్వహిస్తారు.

Next Story