శుక్రవారం పంచాంగం (23-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : ఏకాదశి సా5.28 తదుపరి ద్వాదశి
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : పుబ్బ/పూర్వ ఫల్గుణి రా2.50 తదుపరి ఉత్తర/ఉత్తర ఫల్గుణి
యోగం : వృద్ధి ఉ10.59 తదుపరి ధృవం
కరణం : వణిజ ఉ5.59 తదుపరి భద్ర/విష్ఠి సా5.28 ఆ తదుపరి బవ తె4.45
వర్జ్యం : ఉ11.09 – 12.43
దుర్ముహూర్తం : ఉ8.13 – 9.03 & మ12.23 – 1.13
అమృతకాలం : రా 8.43 – 10.08
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 5.44
సూర్యాస్తమయం : 6.13

(23-04-2021) రాశి ఫలితాలు

మేషం

చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.దాయాదులతో ఊహించని వారితో వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాల్లో మానసిక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం

ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.

మిధునం

సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. ఇంట బయట మీ మాటకి విలువ పెరుగుతుంది.ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.పాత ఋణాలు తీర్చడానికి చేసే నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కర్కాటకం

కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

సింహం

చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘ కాలిక వివాదాలు పరిష్కారమౌతాయి వ్యాపారములలో ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

కన్య

బంధు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు.

తుల

గృహమునకు బందు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతిగా పొందుతారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. , ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలుకొనుగోలుచేస్తారు.వృత్తిఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిడుకులు నుండి బయట పడతారు.భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు

పాత బాకీలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

మకరం

ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది.గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగాసాగుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు.వృత్తి,వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కుంభం

ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.స్ధిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.

మీనం

కొన్ని వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు స్థిరాస్తికి వివాదాలకు సంభందించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.Next Story