తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు

by Shyam |

<p>తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని [&hellip;]</p>

తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 22కు చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వెంటనే అతడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ వారి చేతులకు స్టాంపులు కూడా వేస్తున్నారు. ఒకవేళ చేతిపై స్టాంపులతో ఎవరైనా బయట తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Tags: corona, 22 positive case, telengana

Next Story