- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల్లో చేరిన 220మంది పోలీసులు
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: నార్త్‌జోన్ పరిధిలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 220మంది పోలీసులు కొవిడ్ -19ను జయించి గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా బోయిన్‌పల్లి ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన అభినందన సభలో సీపీ అంజనీకుమార్ స్వాగతం పలికారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా పోలీసులు అధికారులు సైతం పోరాడి గెలిచారని అన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో పోలీసుశాఖలో మహిళలు 30శాతానికి చేరుకుంటారని అన్నారు. మానసిక స్థైర్యాన్ని మరింత కూడబెట్టుకుని […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: నార్త్‌జోన్ పరిధిలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 220మంది పోలీసులు కొవిడ్ -19ను జయించి గురువారం విధుల్లో చేరారు. ఈ సందర్భంగా బోయిన్‌పల్లి ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన అభినందన సభలో సీపీ అంజనీకుమార్ స్వాగతం పలికారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా పోలీసులు అధికారులు సైతం పోరాడి గెలిచారని అన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో పోలీసుశాఖలో మహిళలు 30శాతానికి చేరుకుంటారని అన్నారు. మానసిక స్థైర్యాన్ని మరింత కూడబెట్టుకుని విధుల్లో ఎదురవుతున్న ఒత్తిడిని జయించాలని సూచించారు. స్టేషన్లలో మిగతా సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్ షింగేనావర్, అడిషనల్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story






