సెల్ఫీ ట్రయల్ ఫెయిల్.. తొక్కి చంపిన ఏనుగు

95

దిశ, వెబ్‌డెస్క్ : అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 21ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారి తప్పి జనావాసంలోకి వచ్చిన అడవి ఏనుగును స్థానికులు గమనించారు. దానిని ఎలాగైనా తిరిగి అటవీ ప్రాంతంలోనికి తరిమేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు ఏనుగు వస్తున్న దారిలో నిల్చుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు.

స్థానికులు తరుముతూ ఉండటంతో భయంతో వేగంగా పరిగెత్తుతూ వచ్చిన ఏనుగు అందులో ఓ యువకుడిని తొక్కి చంపేసింది. మిగిలిన వారు భయంతో పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..