ICC World Cup 2023 Warm Up Matches: బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్, శ్రీలంక

by Disha Web Desk 13 |
ICC World Cup 2023 Warm Up Matches: బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్, శ్రీలంక
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023 వార్మప్‌ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్‌ 29) నుంచి స్టార్ట్‌ అయ్యాయి. ఇవాళ మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌.. గౌహతి వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య తివేండ్రం వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. తివేండ్రంలో భారీ వర్షం పడుతుండటంతో టాస్‌ కూడా పడలేదు. మూడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్‌ అయ్యాయి.



Next Story

Most Viewed