World Cup Qualifiers 2023: పసికూనపై శ్రీలంక ఘన విజయం..

by Vinod kumar |   (  Updated:2023-06-24 11:46:18  IST  )

World Cup Qualifiers 2023లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది.

World Cup Qualifiers 2023: పసికూనపై శ్రీలంక ఘన విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: World Cup Qualifiers 2023లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 96 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కేవలం 15 ఓవర్లలలోనే ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు దిముత్‌ కరుణ రత్నే(61), నిస్సాంక(37) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన ఒమెన్‌ శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో హాసరంగా 5 వికెట్లతో ఒమన్‌ను దెబ్బ తీయగా.. లహిరు కుమార 3, రజితా 1 వికెట్‌ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో అయాన్‌ ఖాన్‌(41) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Next Story