ICC World Cup 2023: క్వింటన్ డికాక్ సెంచరీ.. ఆసీస్‌కు భారీ టార్గెట్

by Vinod kumar |   (  Updated:2023-10-12 12:58:50  IST  )

ICC World Cup 2023: క్వింటన్ డికాక్ సెంచరీ.. ఆసీస్‌కు భారీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్‌లకు 7 వికెట్లు కోల్పోయి 311 రన్స్ చేసింది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 84 బంతుల్లో సెంచరీ బాదిన క్వింటన్ డికాక్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ని కొనసాగించాడు. క్వింటన్ డి కాక్ సెంచరీకి తోడు అయిడిన్ మార్క్‌రమ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగుల స్కోరు చేసింది. మిగిలిన బ్యాటర్స్‌లో బవుమా (35), క్లాసెన్ (29), జాన్సన్ (26) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్‌లో.. మాక్స్‌వెల్, స్టార్క్ చెరో 2 వికెట్లు తీశారు.

Next Story