World Cup-2023: వరల్డ్‌ కప్‌లో భారత్‌–పాక్‌ మ్యాచ్‌ తేదీ మార్పు..!

by Vinod kumar |   (  Updated:2023-08-02 13:46:41  IST  )

World Cup-2023 ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదిక ప్రపంచకప్‌ జరుగనున్నది.

World Cup-2023: వరల్డ్‌ కప్‌లో భారత్‌–పాక్‌ మ్యాచ్‌ తేదీ మార్పు..!
X

దిశ, వెబ్‌డెస్క్: World Cup-2023 ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరుగనున్నది. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఐసీసీతో పాటు పాక్‌ బోర్డు సైతం అంగీకారం తెలిపిందని. వాస్తవానికి రెండు జట్ల మధ్య మ్యాచ్ 15 న జరగాల్సి ఉంది. అయితే, అదేరోజు విజయదశమి ఉత్సవాల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను 14న నిర్వహించాలని బీసీసీఐని పోలీసులు కోరారు.

వేడుకల నేపథ్యంలో బందోబస్తు కల్పించడం కష్టమని, ఆ రోజు బలగాలు బిజీగా ఉంటాయని పేర్కొనగా.. బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచులు జరిగే తేదీలు మారిన నేపథ్యంలో ఐసీసీ త్వరలోనే తాజాగా షెడ్యూల్‌ జారీ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే మరికొన్ని జట్లకు సంబంధించి మ్యాచ్‌ల తేదీల్లోనే మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story