ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్.. పసికూనలపై ఆస్ట్రేలియా గెలిచేనా..?

by Disha Web Desk 12 |
ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్.. పసికూనలపై ఆస్ట్రేలియా గెలిచేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ కప్ 2023 లో వరుస ఓటమితో ఉన్న ఆస్ట్రేలియా నేడు నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరుగనుంది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు బౌలింగ్ చేయనుంది. పాకిస్తాన్ పై గెలిచిన ధీమాతో ఆస్ట్రేలియా పసికూనల పై ప్రతాపం చూపేందుకు చూస్తోంది. అలాగే పెద్ద జట్లను చిన్న జట్లు ఓడిస్తూ చరిత్ర సృష్టిస్తున్న క్రమంలో మరోసారి నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

Next Story

Most Viewed