ICC World Cup 2023: శ్రీలంకకు బిగ్‌ షాక్‌.. యువ ఫాస్ట్ బౌలర్ ఔట్‌

by Vinod kumar |   (  Updated:2023-10-24 11:33:47  IST  )

ICC World Cup 2023: శ్రీలంకకు బిగ్‌ షాక్‌.. యువ ఫాస్ట్ బౌలర్ ఔట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో శ్రీలంకకు బిగ్‌ షాక్‌ తగిలింది. శ్రీలంక యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పతిరానా ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలో తప్పకున్నాడు. పతిరానా ప్లేస్‌ను సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌తో శ్రీలంక క్రికెట్‌ భర్తీ చేసింది. ఇప్పటికే గాయం కారణంగా లంక కెప్టెన్‌ దసన్‌ శనక టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పతిరానా కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఆక్టోబర్‌ 26న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది.

Next Story