భారత్ vs న్యూజిలాండ్ సెమీఫైనల్.. గ్రౌండ్‌లో ఘోరం జరగబోతుందని బెదిరింపు

by Malleboina Mahesh |   (  Updated:2023-11-15 06:02:17  IST  )

2023 వన్డే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది.

భారత్ vs న్యూజిలాండ్ సెమీఫైనల్.. గ్రౌండ్‌లో ఘోరం జరగబోతుందని బెదిరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 వన్డే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. కాగా గేమ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. అయితే ముంబై పోలీసులకు వచ్చిన ఓ మెసేజ్ భయాందోళనకు గురి చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులకు.. " ఈ రోజు మైదానంలో ఘోరం జరగబోతుంది". అని మెసేజ్ చేశాడు. అలాగే మెసేజ్ తో పాటుగా గన్, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్లను చూపించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అధికారులు వాంఖడే ప్రాంతంలో, స్టేడియం బయట లోపల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులుకు బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

Next Story