ICC World Cup 2023: వార్నర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా ఆసీస్

by Vinod kumar |   (  Updated:2023-10-25 13:01:16  IST  )

ICC World Cup 2023: వార్నర్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా ఆసీస్
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 24వ లీగ్‌ మ్యాచ్‌‌లో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌తోనూ శతకం బాదిన వార్నర్‌.. తాజాగా నెదర్లాండ్స్‌తోనూ అదే సీన్‌ రిపీట్‌ చేశాడు. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన వార్నర్‌.. 91 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఈ సెంచరీతో వార్నర్‌.. వరల్డ్‌ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ (7) తర్వాత ఆరు సెంచరీలతో సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. వార్నర్‌తో పాటు స్మిత్‌ (71), మార్నస్‌ లబూషేన్‌ (62) లు రాణించడంతో ఆసీస్‌ 40 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌ వంటి హిట్టర్లు ఉన్న నేపథ్యంలో ఆసీస్‌ భారీ స్కోరుపై కన్నేసింది.

Next Story