ICC World Cup 2023: కివీస్‌ను ఆదుకున్న ఫిలిప్స్, లాథమ్.. ఆఫ్ఘన్ టార్గెట్ ఇదే

by Disha Web Desk 13 |
ICC World Cup 2023: కివీస్‌ను ఆదుకున్న ఫిలిప్స్, లాథమ్.. ఆఫ్ఘన్ టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 288 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (71), టామ్ లాథమ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగిలిన బ్యాటర్లలో.. విల్ యంగ్ (50), రచిన్ రవీంద్ర (32), మార్క్ చాప్మన్ (25) పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్, నవీన్-ఉల్-హక్ చెరో 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్ తలో వికెట్ పడగొట్టారు.

Next Story

Most Viewed