- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ICC World Cup 2023: రహమానుల్లా గుర్బాజ్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన అఫ్ఘనిస్తాన్

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అప్ఘానిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచి వీరవీహారం చేస్తున్న ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ ఔటయ్యాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బట్లర్ వేసిన త్రోకు గుర్బాజ్ రనౌట్ అయ్యాడు. రహమానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80) పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అప్ఘానిస్థాన్ మిగిలిన బ్యాటర్స్.. ఇబ్రహీం జద్రాన్ (28), రహమత్ షా (3), హష్మతుల్లా షాహిదీ (14), అజ్మతుల్లా ఒమర్జాయ్ (19) విఫలమవడంతో.. 35 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇక్రమ్ అలీఖిల్ (23), మహమ్మద్ నబీ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్ గుర్బాజ్ వీరోచిత బ్యాటింగ్‌తో కేవలం 13 ఓవర్లకే అప్ఘాన్ స్కోర్ 100 పరుగులు దాటింది. ఆ తర్వాత నుంచి వరుసగా వికెట్లు పతనమయ్యాయి. దాంతో 114/0 తో పటిష్టంగా ఉన్న అప్ఘాన్ 183/5 చేరింది.






