ఇండియా vs బంగ్లాదేశ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్

by Disha Web Desk 12 |
ఇండియా vs బంగ్లాదేశ్.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈ రోజు 17వ మ్యాచ్ ఇండియా vs బంగ్లాదేశ్ మధ్య పూనేలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. కాగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న భారత్ బంగ్లాపై ఈజీ విజయాన్ని నమోదు చేసుకుని మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్ చేరేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే బంగ్లా కూడా భారత్ పై ఎలాగైనా గెలిచి తమ సత్తాను చూపాలని చూస్తుంది. ఈ క్రమంలో మ్యాచ్ చివరి వరకు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మరి ఇలాంటి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం

Next Story

Most Viewed