2023 Cricket World Cup : ఆసీస్‌కు మరో షాక్.. స్వదేశానికి స్టార్ బ్యాటర్..

by Vinod kumar |   (  Updated:2023-11-02 14:49:22  IST  )

2023 Cricket World Cup : ఆసీస్‌కు మరో షాక్.. స్వదేశానికి స్టార్ బ్యాటర్..
X

న్యూఢిల్లీ : వన్డే ప్రపంచకప్‌‌లో సెమీస్ రేసులో ఉన్న ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయపడగా.. తాజాగా ఈ మ్యాచ్‌కు బ్యాటర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం వెల్లడించింది. అయితే, అతను తిరిగి రావడంపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దాంతో మార్ష్ తిరిగి ప్రపంచకప్‌లో భాగమవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మార్ష్ గైర్హాజరుతో స్టీవ్ స్మిత్ 3వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే చాన్స్ ఉంది. అలాగే, చిన్న గాయంతో ఆసిస్ చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన మార్కస్ స్టోయినిస్ తిరిగి తుది జట్టులోకి రావొచ్చు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు కూడా అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం ఆసిస్ జట్టు 8 పాయింట్స్‌తో 3వ స్థానంలో ఉంది. శనివారం కీలక పోరులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Next Story