బిగ్‌న్యూస్.. టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్‌ రిలీజ్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రియులకు ఐసీసీ బిగ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్న మెన్స్ టీ20 వరల్డ్‌ కప్ షెడ్యూల్‌ను కన్ఫామ్ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13వరకు టీ20 వరల్డ్ కప్ కొనసాగనున్నట్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మొత్తం 45 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెమీఫైనల్ 1 నవంబర్ 9న సిడ్నీలో, సెమీ ఫైనల్ 2 నవంబర్ 10న అడిలైడ్‌లో జరగనుంది. ఇక నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ [&hellip;]</p>

బిగ్‌న్యూస్..  టీ20 వరల్డ్ కప్ 2022 షెడ్యూల్‌ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రియులకు ఐసీసీ బిగ్‌న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్న మెన్స్ టీ20 వరల్డ్‌ కప్ షెడ్యూల్‌ను కన్ఫామ్ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13వరకు టీ20 వరల్డ్ కప్ కొనసాగనున్నట్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా మొత్తం 45 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సెమీఫైనల్ 1 నవంబర్ 9న సిడ్నీలో, సెమీ ఫైనల్ 2 నవంబర్ 10న అడిలైడ్‌లో జరగనుంది. ఇక నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. టీ20 మ్యాచ్‌ల కోసం టికెట్లు నేటి నుంచే బుక్ చేసుకునేందుకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఇదే సమయంలో మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను జనవరిలో విడుదల చేయనున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది.

Next Story