వెండితెరపైకి విశ్వసుందరి హర్నాజ్.. తొలి సినిమా ఎవరితోనో తెలుసా?

by  |
Harnaz
X

దిశ, సినిమా: ఇటీవల జరిగిన విశ్వసుందరి పోటీల్లో విజేతగా నిలిచిన ఇండియన్ బ్యూటీ హర్నాజ్‌ సంధూ.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు మిస్‌ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో భారతీయురాలిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే మాములుగా ఈ అందాల పోటీల్లో గెలిచిన అందరూ సినిమాల్లోకి అడుగుపెట్టగా.. తాజాగా సంధూ కోసం బడా నిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇక హర్నాజ్‌ కూడా తెరపై తన అందాలను ఆరబోసేందుకు ఆతృతగా ఉన్నట్లు కనిపిస్తుండగా.. మిస్‌ యూనివర్స్‌ పోటీలకు ముందే పంజాబ్‌లో తన మొదటి సినిమాకు సైన్‌ చేసినట్లు టాక్.

పంజాబీ సీనియర్‌ నటి ఉపాసనా సింగ్‌ కుమారుడు నానక్‌‌‌కు జంటగా ‘బాయి జీ కుట్టంగే’ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఉపాసనా సింగ్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే సగానికిపైగా పూర్తి చేసుకోగా 2022 మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ‘యారన్ దియాన్ పో బారా’ అనే మరో పంజాబీ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.



Next Story

Most Viewed