పాక్‌లో హిందువులకు భద్రత కరువు

by  |
పాక్‌లో హిందువులకు భద్రత కరువు
X

-భారత పౌరసత్వం కోరుతున్న 200మంది పాకిస్తానీ హిందువులు

పాకిస్తాన్‌లో హిందువులకు భద్రత కరువైందని, యువతులపైన అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆ దేశానికి చెందిన 200మంది హిందువులు సోమవారం ఇండియా-పాక్ మధ్యనున్న అట్టారి, వాఘా సరిహద్దు గుండా దేశంలోని ప్రవేశించారు. పాకిస్తాన్‌లో తమంతా అభద్రతాభావంతో ఉన్నామని, తిరిగి ఆ దేశానికి వెళ్లాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. తమకు భారత పౌరసత్వం ఇస్తే సంతోషంగా ఇక్కడే బతుకుతామని చెప్పుకొచ్చారు. అక్కడ హిందూ బాలికలు కనిపిస్తే చాలు కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని కొందరు మహిళలు చెప్పారు. హరిద్వార్ పర్యటన కోసం 25రోజుల విజిటర్ వీసాలపై వచ్చిన వారంతా భారత పౌరసత్వం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. కాగా, పాకిస్తాన్ నుంచి వచ్చిన నాలుగు సిక్కు కుటుంబాలను రిసీవ్ చేసుకోవడానికి శిరోమణి అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిక్రా కూడా అత్తారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం కలిసి, వీరికి సాధ్యమైనంత త్వరగా భారత పౌరసత్వం ఇప్పించేలా చూస్తానని చెప్పారు. సీఏఏ చట్టంలోకి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పొరుగు దేశాల్లోని హిందువులు భారత్‌కు వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed