- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయ్యో బిడ్డా.. చంపి కాలువలో పడేసారా తల్లి !
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చందూరు మండలం కారేగాం సమీపంలోని కాలువలో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం అయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే చిన్నారి మృతదేహంపై గాయాలు ఉండటంతో ఎవరో కొట్టి చంపి తీసుకువచ్చి కాలువలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. చనిపోయిన బాలిక.. చందూరు మండలానికి చెందిన చిన్నారినా లేకుంటే ఇతర ప్రాంతంలో నుంచి కాలువలో కొట్టుకొచ్చిందా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చందూరు మండలం కారేగాం సమీపంలోని కాలువలో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం అయ్యింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే చిన్నారి మృతదేహంపై గాయాలు ఉండటంతో ఎవరో కొట్టి చంపి తీసుకువచ్చి కాలువలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. చనిపోయిన బాలిక.. చందూరు మండలానికి చెందిన చిన్నారినా లేకుంటే ఇతర ప్రాంతంలో నుంచి కాలువలో కొట్టుకొచ్చిందా అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






