- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరాలలో ఉద్రిక్తత : రోడ్డెక్కిన 2 వైసీపీ వర్గాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చీరాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడియార స్తంభం దగ్గర వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు రెడీ అయ్యారు. వైఎస్ విగ్రహం వద్ద కరణం వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టారు. తమ ఫ్లెక్సీలే కట్టాలంటూ ఆమంచి వర్గీయులు వాదనకు దిగారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైన ఆమంచి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దీంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: చీరాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడియార స్తంభం దగ్గర వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు రెడీ అయ్యారు. వైఎస్ విగ్రహం వద్ద కరణం వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టారు. తమ ఫ్లెక్సీలే కట్టాలంటూ ఆమంచి వర్గీయులు వాదనకు దిగారు.
అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైన ఆమంచి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తామని సీఐ రాజమోహన్ వెల్లడించారు. కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో చీరాల వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే.
Next Story






