ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ఏం చేస్తున్నారు: రాహుల్

by Shamantha N |

<p>న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోయారని కానీ కేంద్రానికి మాత్రం జవాబుదారీతనం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. సున్నా పారదర్శకత’ అని ట్వీట్ చేశారు. ఈ [&hellip;]</p>

ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ఏం చేస్తున్నారు: రాహుల్
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోయారని కానీ కేంద్రానికి మాత్రం జవాబుదారీతనం లేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. సున్నా పారదర్శకత’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కరోనా బారినపడి చనిపోయినవారికి రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. వారెవరూ ఒంటరికాదని, దేశ ప్రజల ప్రార్థనలు వారితో ఉన్నాయని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story