ఒక్కరిని చంపాలనుకుంటే.. ఇద్దరు హతమయ్యారు

by  |
Unnav
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమించిన బాలిక దక్కడం లేదన్న కోపంతో ఆమెను అంతం చేయాలని ప్రియుడి ప్లాన్.. ఆ కుటుంబాన్ని విషాధంలో ముంచెత్తింది. తన ప్రేమను అంగీకరించని బాలికను హత్య చేయాలని భావించిన అతడి పధకంతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలను వదలకుండా వెళ్లిన నిందితులను పోలీసులు టెక్నాలజీ సాయంతో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉన్నావ్‌కు సమీపంలోని ఓ గ్రామంలో మూడు రోజుల క్రితం ముగ్గురు మైనర్ బాలికలు విషప్రయోగానికి గురైన విషయం తెలిసిందే. పశువులను మోపడానికి వ్యవసాయ పొలాలకు వెళ్లిన 14, 15, 16 సంవత్సరాల బాలుకలు సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకగా.. పొలాల్లో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. వారిని వెంటనే కాన్పూర్ లోని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఇద్దరు బాలికలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో బాలిక విషమ పరిస్థితిలో ఉన్నారు. వారి ముగ్గురుపై విషప్రయోగం జరిగనట్లు డాక్టర్లు తెలిపారు. ఈ కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

బాలికలు పడిపోయిన పొలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. వారి తాగిన వాటర్ బాటిల్ మాత్రమే కనిపించింది. క్షుణ్ణంగా పరిశీలించగా.. సిగరేట్ పీక లభించింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. దీంతో కేసు చిక్కుముడి రెండు రోజుల్లోనే వీడింది. ఇంతకూ పోలీసుల దర్యాప్తులో ఏం తేలిందంటే..

గ్రామానికి చెందిన వినయ్.. బాలికలతో కలిసి లాక్ డౌన్ సమయం నుంచి రోజూ పశువులను మేపడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ముగ్గురులోని ఓ బాలికను వినయ్ ప్రేమించాడు. ఆ విషయాన్ని బాలికకు చెప్పినా ఆమె దానికి అంగీకరించలేదు. అలా వన్ సైడ్ లవ్ తో వెంటపడినా ఆమె తిరస్కరించింది. విసిగిపోయిన విజయ్.. ఆమెను అంతమొందించాలని అనుకున్నారు. అందుకు తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు.

ప్లాన్‌లో భాగంగా.. రోజు మాదిరిగానే పశువులను మేపడానికి వెళ్లిన వినయ్ తన వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిల్ లో పురుగుల మందు కలిపాడు. వాటితోపాటు తినుబండారాలను తీసుకెళ్లాడు. అందరూ కలిసి అన్నం తినే సమయంలో వినయ్ పురుగుల మందు కలిపిన నీటిని తను ప్రేమించిన బాలికకు తాగించాలనుకున్నాడు. కానీ ముగ్గురు బాలికలు తినుబండారాలు తినడంతోపాటు విషం నీటిని తాగారు. కొద్ది సేపటికే వాళ్లు ముగ్గురు అపస్మారక స్థితికి చేరుకోవడంతో భయపడిన వినయ్, అతడి స్నేహితులు పరారీ అయ్యారు.

పోలీసులకు దొరికిన సిగరేట్ పీక, వాటర్ బాటిల్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మొదట వినయ్ మిత్రులు పాత్ర తెలిసింది. వారిని అరెస్ట్ చేసి ఎంక్వేరీ చేయాగా.. వినయ్ ఘాతుకం బయటపడింది. విజయ్ ఫోన్ కాల్ రికార్డులు, హత్య జరిగిన సమయంలో టవర్ లొకేషన్ అన్ని సరిపోవడంతో పోలీసులు అతడిని శనివారం అరెస్ట్ చేశారు.


Next Story