తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా

by  |
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,02,595కి చేరింది. 26,644 యాక్టివ్ కేసులు ఉండగా… 1,74,769 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అంతేగాకుండా తాజాగా 2,381 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,181కి చేరింది. ఒక్క రోజే 50,598 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 32,92,195కి చేరింది.

Next Story