- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 161
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సద్దుమణగడం లేదు. ఏరోజుకారోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూ అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న సాయంత్రానికి 141 కేసులుగా ఉన్న కరోనా నేటికి 20 మందికి సోకింది. గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “రాష్ట్రంలో […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సద్దుమణగడం లేదు. ఏరోజుకారోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూ అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న సాయంత్రానికి 141 కేసులుగా ఉన్న కరోనా నేటికి 20 మందికి సోకింది. గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, “రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ – 19 కేసుల సంఖ్య 161 కి పెరిగింది” అని పేర్కొంది.

Tags: corona virus, covid-19,ap, corona in ap
Next Story






