తెలంగాణలో కొత్తగా 1,602 కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 1,602 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,602 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,47,284 చేరుకోగా.. ఇప్పటివరకు 1,366 మరణాలు సంభవించాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 19,272 యాక్టివ్ కేసులుండగా, 2.47లక్షల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Next Story

Most Viewed