ఇండోర్‌.. 24 గంటల్లో 159 కేసులు

by B.Srinivas |

<p>భోపాల్: స్వచ్ఛతకు మారుపేరైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం.. ప్రస్తుతం కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే 159 కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజా కేసులతో కలిపి ఒక్క ఇండోర్ జిల్లా పరిధిలోనే కరోనా బాధితుల సంఖ్య 600కు చేరువైనట్టు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రవీణ్ జాడియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 987కు చేరినట్టు తెలిపారు. అలాగే, 187 కరోనా మరణాలతో [&hellip;]</p>

ఇండోర్‌.. 24 గంటల్లో 159 కేసులు
X

భోపాల్: స్వచ్ఛతకు మారుపేరైన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం.. ప్రస్తుతం కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే 159 కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజా కేసులతో కలిపి ఒక్క ఇండోర్ జిల్లా పరిధిలోనే కరోనా బాధితుల సంఖ్య 600కు చేరువైనట్టు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రవీణ్ జాడియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 987కు చేరినట్టు తెలిపారు. అలాగే, 187 కరోనా మరణాలతో మధ్యప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు.

Tags: corona, positive cases 159 indore, madhya pradesh

Next Story