- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
<p>దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రూ.15లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖ జిల్లా చోడవరం మండలం అన్నవరానికి చెందిన షేక్ ఇస్మాయిల్ చింతపల్లిలో నివాసం ఉంటున్నాడు. గంజాయి తరలిస్తూ 2017లో గోలుగొండ, 2020 జులైలో రోలుగుంట పీఎస్ పరిధిలో అరెస్ట్ అయి నవంబర్ 12న జైలు నుంచి విడులయ్యాడు. మళ్లీ గంజాయి విక్రయించేందుకు ప్రణాళికలు రచించిన ఇస్మాయిల్.. విశాఖలో కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రూ.15లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖ జిల్లా చోడవరం మండలం అన్నవరానికి చెందిన షేక్ ఇస్మాయిల్ చింతపల్లిలో నివాసం ఉంటున్నాడు. గంజాయి తరలిస్తూ 2017లో గోలుగొండ, 2020 జులైలో రోలుగుంట పీఎస్ పరిధిలో అరెస్ట్ అయి నవంబర్ 12న జైలు నుంచి విడులయ్యాడు. మళ్లీ గంజాయి విక్రయించేందుకు ప్రణాళికలు రచించిన ఇస్మాయిల్.. విశాఖలో కిలో గంజాయి రూ.వెయ్యికి కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో రూ.10వేలకు అమ్మేందుకు ప్లాన్ చేశాడు. దూల్‌పేటకు చెందిన అరుణ్‌సింగ్‌తో ఒప్పందం చేసుకొని గంజాయిని హైదరాబాద్ తీసుకువచ్చాడు. బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో దూల్‌పేటకు వెళ్తుండగా ఉప్పల్ పోలీసులు ఆటోను తనిఖీ చేసి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.






