యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరు అరెస్ట్

by Batti.Sumithra |

<p>లక్నో : సుమారు 1500 కరోనా కేసులు నమోదైన ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకుంది. కరోనా విజృంభణతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇంటికే పరిమితమైన తరుణంలో కొందరు మాత్రం మహిళలపై అఘాయిత్యాలను మానడం లేదు. ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. ఒకరు పారిపోయినట్టు అధికారులు తెలిపారు. 13 ఏళ్ల బాలిక పంటపొలాల నుంచి మధ్యాహ్నం ఇంటికి తిరిగెళ్లుతుండగా.. [&hellip;]</p>

యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరు అరెస్ట్
X

లక్నో : సుమారు 1500 కరోనా కేసులు నమోదైన ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్ రేప్ ఘటన చోటుచేసుకుంది. కరోనా విజృంభణతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇంటికే పరిమితమైన తరుణంలో కొందరు మాత్రం మహిళలపై అఘాయిత్యాలను మానడం లేదు. ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. ఒకరు పారిపోయినట్టు అధికారులు తెలిపారు. 13 ఏళ్ల బాలిక పంటపొలాల నుంచి మధ్యాహ్నం ఇంటికి తిరిగెళ్లుతుండగా.. అడ్డగించి ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. మిగతా ఆ నిందితులకు సహకరించారని, ఫోన్‌లో ఘటనను చిత్రీకరించారని ఎస్‌పీ ఎల్ ఆర్ కుమార్ వివరించారు.

Tags: crime, up, sitapur, gang rape, girl, arrest

Next Story