- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రిలో మంటలు.. 13 మంది కరోనా రోగులు మృతి
<p>ముంబయి : మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై సుమారు పాతికమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే అక్కడ మరో ప్రమాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 13 మంది కొవిడ్ పేషెంట్లు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని […]</p>

ముంబయి : మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకై సుమారు పాతికమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే అక్కడ మరో ప్రమాదం చోటుచేసుకుంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో 13 మంది కొవిడ్ పేషెంట్లు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో ఉన్న విజయ్ వల్లభ్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. ఐసీయూలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. ఆ సమయంలో ఐసీయూలో 17 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది మరణించగా.. ఐసీయూలో ఉన్న మిగిలిన ఐదుగురితో పాటు ఆస్పత్రిలోని మిగతా పేషెంట్లను పక్కనున్న హాస్పిటల్ లోకి షిఫ్ట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
#UPDATE 13 people have died so far in fire at COVID hospital in Virar, in Vasai Virar municipal limits, Palghar district
(Earlier visuals)#Maharashtra pic.twitter.com/KHTiSqbLMY
— ANI (@ANI) April 23, 2021






