వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం..

118

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం సృష్టించింది. ఫిట్స్‌తో కొంతమంది బాధితులు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఇప్పటివరకు 120 మంది ఆస్పత్రిలో చేరగా అందులో 17 మంది డిశ్చార్జి అయ్యారు. ఇదిలాఉండగా, ఈ వ్యాధిపై సాయంత్రానికి కల్లా రిపోర్టులు వెలువడతాయని వైద్యులు వెల్లడించారు. బాధితులను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కల్తీ కల్లు తాగడం వల్లే వీరంతా జబ్బు పడినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 14 కల్లు కంపౌండ్లను పోలీసులు సీజ్ చేశారు. రిపోర్టులు వచ్చిన అనంతరం అసలు విషయం వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..