- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రిలేడని 11 ఏళ్ళ బాలుడు బలవన్మరణం
<p>దిశ, వెబ్ డెస్క్ : తండ్రి మరణాన్ని తట్టుకోలేని 11 ఏళ్ళ పసిబాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని విశ్వనాథ్ పేట్ వైయస్సార్ నగర్ కాలనీలో విశ్వవార్ సుధాకర్, నందిని లు కొన్నేళ్లుగా కూలిపని చేసుకుంటూ నివశిస్తున్నారు. సుధాకర్ నెల రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణాన్ని చిన్న కొడుకు సాయిరాం జీర్ణించు కోలేకపోయాడు. బుధవారం వారు నివశిస్తున్న కాలనీలో గణేష్ నిమజ్జనం ఉండటంతో తల్లి నందినికి చెప్పి బయటకు వెళ్లాడు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తండ్రి మరణాన్ని తట్టుకోలేని 11 ఏళ్ళ పసిబాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని విశ్వనాథ్ పేట్ వైయస్సార్ నగర్ కాలనీలో విశ్వవార్ సుధాకర్, నందిని లు కొన్నేళ్లుగా కూలిపని చేసుకుంటూ నివశిస్తున్నారు. సుధాకర్ నెల రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మరణాన్ని చిన్న కొడుకు సాయిరాం జీర్ణించు కోలేకపోయాడు.
బుధవారం వారు నివశిస్తున్న కాలనీలో గణేష్ నిమజ్జనం ఉండటంతో తల్లి నందినికి చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తల్లి కాలనీ అంతా గాలించింది. కాగా గురువారం ఉదయం వారు ఉంటున్న ఇంట్లోనే పక్క గదిలో దూలానికి ఉరేసుకుని సాయిరాం కనిపించాడు. వెంటనే నందిని పోలీసులకు సమాచారం అందించింది. రెండు నెలల వ్యవధిలోనే భర్త, కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె రోదన వర్ణనాతీతంగా ఉంది.
Next Story






