11 మంది వైసీపీ ఎమ్మెల్సీల ఏకగ్రీవం.. మండలిలో పెరిగిన బలం

by  |
11 మంది వైసీపీ ఎమ్మెల్సీల ఏకగ్రీవం.. మండలిలో పెరిగిన బలం
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో పూర్తి మెజార్టీతో ఉన్న వైసీపీ.. ఇప్పుడు శాసనమండలిలోనూ అత్యధిక సభ్యులు కలిగిన పార్టీగా అవతరించింది. అసెంబ్లీలో 151 మందితో వైసీపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా శాసన మండలిలోనూ అదే స్థాయిలో బలాన్ని పెంచుకుంది. స్థానిక సంస్థల కోటాలో నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీకి చెందిన 11 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మండలిలో వైసీపీ బలం 32కు చేరనుంది. రాష్ట్రంలో 8 జిల్లాల్లో 11 మంది సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. అనంతపురం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టి. వెంకట శివ నాయుడు తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకోవడంతో మొత్తం 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నట్లైంది. శాసన మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటే ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య 32కు చేరింది.

11 మంది ఏకగ్రీవం

స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ప్రకటించిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన అభ్యర్థుల వివరాలు జిల్లాల వారీగా విజయనగరం-ఇందుకూరు రఘురాజు, విశాఖ నుంచి వరుదు కళ్యాణి, వంశీకృష్ణయాదవ్ ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి-అనంత ఉదయ భాస్కర్, కృష్ణా- తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు మండలికి ఎన్నికయ్యారు. వీరితో పాటు చిత్తూరు జిల్లా నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్.. అనంతపురం జిల్లా నుంచి వై శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.

Next Story

Most Viewed