- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్ ఫ్లాష్ : కొండచరియలు విరిగిపడి 11మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఈ ఘటన చెంబూరులోని భరత్ నగర్‌లో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్న కారణంగా కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. ఆ సమయంలో కొండను అనుకుని ఉన్న గోడ కూలిపోయి దాని కింద నివసిస్తున్న జనాలపై పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఈ ఘటన చెంబూరులోని భరత్ నగర్‌లో ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్న కారణంగా కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. ఆ సమయంలో కొండను అనుకుని ఉన్న గోడ కూలిపోయి దాని కింద నివసిస్తున్న జనాలపై పడటంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.
Next Story






