24 గంట‌ల్లోపే 11 కరోనా కేసులు.. ఎక్కడంటే..?

by  |
24 గంట‌ల్లోపే 11 కరోనా కేసులు.. ఎక్కడంటే..?
X

దిశ, ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాను క‌రోనా వ‌ణికిస్తోంది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలోపే 11 కొత్త కేసులు న‌మోదు కావ‌డం జిల్లా వాసుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలోనే అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌గా పాల్వంచలో కూడా క్ర‌మంగా పెరుగుతున్నాయి. మిగ‌తా మండ‌లాల్లో కూడా అక్క‌డ‌క్క‌డా హైద‌రాబాద్ కాంటాక్టుల‌తో కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి. జిల్లాలో ప్ర‌స్తుతం 22 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్న‌ట్లు జిల్లా వైద్యాధికారులు ధృవీక‌రించారు. ఆదివారం కొత్త‌గా న‌మోదైన ఐదు కేసుల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు ఫ‌స్ట్ కాంటాక్ట్‌లో ఉన్న 1టౌన్ ఎస్సైకి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

ల‌క్ష్మీదేవిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లోని ఓ కానిస్టేబుల్‌కు, పాల్వంచ మండ‌ల‌కేంద్రానికి చెందిన ఇద్ద‌రు యువ‌తుల‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వీరిద్ద‌రూ కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ వెళ్లి వ‌చ్చిన క్ర‌మంలోనే క‌రోనా బారిన ప‌డ్డ‌ట్లుగా తెలుస్తోంది. జిల్లా కాంగ్రెస్ నేత‌గా, సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క‌కు అత్యంత స‌న్నిహితుడైన జిల్లా నేత‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. తాజాగా సోమ‌వారం ఉద‌యం నాటికి మ‌రో 6 కేసులు పెరిగాయి. ఇందులో సింగ‌రేణి ప్ర‌ధాన‌ ఆస్ప‌త్రిలో వైద్యుడికి పాజిటివ్ రాగా, కొత్త‌గూడెంలోని ప్రైవేటు ఆస్ప‌త్రిలోని ఇద్ద‌రు వైద్య సిబ్బందికి నిర్ధార‌ణ అయింది. పెనుబ‌ల్లి, గంప‌ల‌గూడెం, కొత్త‌గూడెం జిల్లాకేంద్రంలోని బాబుక్యాంపున‌కు చెందిన ఒకరు ఉన్నారు. మొత్తం ఆరు కేసుల్లో న‌లుగురికి డాక్ట‌ర్ శంక‌ర్‌నాయ‌క్ ఫ‌స్ట్‌కాంటాక్టు ద్వారానే క‌రోనా సోకిన‌ట్లుగా వైద్యుల ద్వారా తెలుస్తోంది. మరొకరికి వి. హ‌నుమంత‌రావు ద్వారా సోకిన‌ట్లుగా వైద్యులు చెబుతున్నారు.



Next Story